: ఏపీలో త్వరలో క్లస్టర్ పాఠశాలల విధానం: మంత్రి రావెల
గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా త్వరలో ఏపీలో క్లస్టర్ పాఠశాలల విధానానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. మండలానికి మూడు క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో క్లస్టర్ పాఠశాలకు పదివేల మంది విద్యార్థులు ఉంటారని సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. తొలుతగా కుప్పంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు రావెల వెల్లడించారు.