: సర్వం స్మార్ట్ ఫోన్ మయం!


స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. ఎదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఎంచుకోవాలన్నా, బిల్లు చెల్లించాలన్నా, డబ్బులు వేరేవారి ఖాతాలో జమచేయాలన్నా స్మార్ట్ ఫోన్ నే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్మార్ట్ ఫోన్ అమ్మకాలపై ఐడీసీ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆసియా ఫసిఫిక్ దేశాల్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఊపందుకోగా, భారత్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు అమోఘంగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 82 శాతం వృద్ధితో భారత్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయని సర్వే తెలిపింది. ఫోన్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతమవుతుండడంతో మొబైల్ వినియోగదారులు స్మార్ట్ ఫోన్లకు అప్ గ్రేడ్ అవుతున్నారు. దీంతో ఈ ఏడాది 5.3 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని సర్వే వెల్లడించింది. దీంతో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ అమాంతం పెరిగిపోతుందని, మొత్తం 75,000 కోట్ల రూపాయల మొబైల్ ఫోన్ల మార్కెట్ విలువలో, 52,000 కోట్ల రూపాయల వాటా స్మార్ట్ ఫోన్లదేనని సర్వే అంచనా వేసింది. గత తొమ్మిది నెలల్లో 39,000 కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయని సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News