: చంద్రబాబు వెంట వెళ్లిన వారికి విషయపరిజ్ఞానం లేదు: రోజా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వెంట విదేశీ పర్యటనలకు వెళ్తున్న వారిలో విషయపరిజ్ఞానం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామంటూ వెళ్లిన వారిలో సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యా వ్యాపారస్తులు, సంచులు మోసే వారున్నారు తప్ప, పెట్టుబడులను రప్పించేందుకు అవసరమైన పరిజ్ఞానం ఉన్నవారు లేరని అన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు, ఇచ్చిన మాట నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. బాబులా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే వైఎస్సార్సీపీ అధికారంలో ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. బాబు మారారని ప్రజలు భావించారని, ఆయన మారడం వాస్తవమేనని, కాకుంటే గతంలో కంటే ఎక్కువ మోసగాడిగా మారారని ఆమె విమర్శించారు. బాబు చేతకానితనం వల్లే రాష్ట్ర విభజనకు అంకురార్పణ జరిగిందని రోజా దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News