: హ్యూస్ మృతికి సంతాప సూచనగా భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా టీమిండియా ఆడాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను రద్దు చేశారు. ఆసీస్ పర్యటనలో భారత్ సన్నాహకాల్లో భాగంగా ఈ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. కాగా, బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ హ్యూస్ మృత్యువుతో పోరాడుతూ ఈ ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే.