: విశాఖ సమీపంలో కూలిన హెలికాఫ్టర్!
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని డౌనూరు సమీపంలో ఓ హెలికాఫ్టర్ కూలినట్లు తెలిసింది. అయితే, హెలికాఫ్టర్ ఏ సంస్థకు చెందినది? ఏ మోడల్? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై స్థానికుల నుంచి తనకు సమాచారం వచ్చిందని, ఎక్కడ కూలిందో తెలియదని, దర్యాప్తు చేపట్టామని కొయ్యూరు సీఐ తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం అందవలసి ఉంది.