: రొట్టె, పప్పు తిన్న మోదీ... చికెన్, మటన్ లాగించిన షరీఫ్
సార్క్ సమావేశాల్లో భాగంగా నేపాల్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ సాదాసీదా భోజనంతో సరిపుచ్చుకున్నారు. ఖాట్మండూలోని హోటల్ క్రౌన్ ప్లాజాలో బస చేసిన మోదీ లంచ్ లో జీరా రైస్, పప్పు, రోటీలను ఆహారంగా తీసుకున్నారు. ఆయన కోసం తక్కువ నూనె వేసి ఆహార పదార్థాలను తయారు చేసినట్టు హోటల్ వర్గాలు వెల్లడించాయి. రాత్రి డిన్నర్ లోనూ ఆయన మితాహారమే స్వీకరించారట. అల్పాహార సమయంలో ఊతప్పం, ఇడ్లీలను చెఫ్ లు తయారుచేసి అందించారు. ఇదే సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చికెన్, మటన్, ఫిష్ తదితరాలతో భారీ మెనూను ఏర్పాటు చేశామని హోటల్ తెలిపింది.