: హ్యూస్... వెళ్లిపోయావా!: టీమిండియా సంతాపం


ఆసీస్ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ 25 ఏళ్లకే బాధాకర పరిస్థితుల్లో తనువు చాలించడంపై టీమిండియా స్పందించింది. హ్యూస్ మృతికి సంతాపం తెలియజేస్తున్న క్రికెట్ ప్రపంచంతో తాము కూడా జతకూడుతున్నామని తెలిపింది. హ్యూస్ అందరినీ వదిలి వెళ్లిపోయాడని పేర్కొంది. అతని కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ద్వారా భారత జట్టు మేనేజ్ మెంట్ ఓ ప్రకటన చేసింది.

  • Loading...

More Telugu News