: ‘చెన్నై’కి ధోనీ కెప్టెన్ గా ఎలా కొనసాగుతారు?: సుప్రీంకోర్టు ప్రశ్న
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ కు వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఆ జట్టుకు కెప్టెన్ గా ఎలా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ సందర్భంగా గురువారం కోర్టు ఈ మేరకు ధోనీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ యజమానులెవరో చెప్పాలంటూ శ్రీనివాసన్ తరపు న్యాయవాదిని నిలదీసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు శ్రీనివాసన్ తరపు న్యాయవాది కాస్త కష్టపడ్డారట.