: మూడు రోజుల్లో హ్యూస్ బర్త్ డే... అంతలోనే ఎంత విషాదం!
క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ, ఈ లోకం విడిచిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరో మూడు రోజుల్లో బర్త్ డే జరుపుకోవాల్సి ఉందన్న వార్త గుండెలు పిండేసేదే. నవంబర్ 30వ తేదీ అతడి పుట్టినరోజు. దీంతో, హ్యూస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధుమిత్రులు హ్యూస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు.