: రూ.60 దిగువకు రానున్న పెట్రోల్ ధర!
భారత్ లోని పెట్రోల్ ఆధారిత వాహన యజమానులకు శుభవార్త! సమీప భవిష్యత్తులో పెట్రోల్ ధర లీటరుకు రూ.60 కన్నా దిగువకు రానుందట. చమురురంగంలోని నిపుణుల అంచనాల మేరకు ప్రస్తుతం 75 డాలర్ల వద్ద కొనసాగుతున్న బ్యారల్ ముడిచమురు ధర 60 డాలర్ల వరకూ తగ్గనుంది. అదే జరిగితే, దేశవాళీ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.60 కన్నా కిందకు వస్తుంది. 2011 మే వరకూ రూ.60 దిగువన ఉన్న పెట్రోల్ ధర ఆ తరువాత పైపైకి వెళ్లింది. తదనంతరం, మరే దశలోనూ రూ.60 దిగువకి చేరలేదు. గడచిన జూన్ లో రూ.6600 (110 డాలర్లు) వద్ద ఉన్న బ్యారల్ క్రూడాయిల్ ధర ఈ నెలలో రూ.4,800 (76 డాలర్లు)కు పడిపోయింది. నేటి సాయంత్రం జరగనున్న ఒపెక్ సమావేశంలో ముడిచమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అరబ్ దేశాలు అంగీకరించకుంటే ధరలు మరింతగా తగ్గవచ్చు.