: వక్ఫ్ భూముల అన్యాక్రాంతంలో అందరికీ పాత్ర: అక్బరుద్దీన్
హైదరాబాద్ పరిధిలోని వక్ఫ్ భూములు తరిగిపోవడానికి అటు రాజకీయ నేతలతో పాటు ఇటు అధికారగణం కూడా తమ వంతు పాత్ర పోషించిందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. భూ కేటాయింపులపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన, కేటాయింపుల తర్వాత జరిగిన అక్రమాలపై దృష్టి సారించని వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారమిస్తే, అడిగిన వారందరికీ భూములను కేటాయించిన ప్రభుత్వాలు, ఆ తర్వాత వాటిలో జరుగుతున్న అవినీతి తంతు కళ్లకు కనబడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భూ కేటాయింపులపై కిరణ్మయి కమిటీ నివేదికను సభలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.