: కర్నూలులో పడగవిప్పిన ఫ్యాక్షన్... సర్పంచ్ దారుణ హత్య
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ పగలు ఓ సర్పంచ్ ను బలి తీసుకున్నాయి. బనగానపల్లె మండలం పలుకూరు గ్రామ సర్పంచ్ ప్రభాకర్ నాయుడిని ఆయన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. గ్రామ పరిధిలోని నాపరాళ్ల గనుల్లోకి వెళ్లిన ప్రభాకర్ నాయుడిని వెంబడించిన ప్రత్యర్థులు అక్కడే ఆయనపై దాడికి దిగారు. ప్రత్యర్థుల దాడిలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.