: ఎల్ఓసీ వద్ద ఆర్మీ బంకర్ లోకి చొరబడిన ఉగ్రవాదులు


జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి ఆర్మీ బంకర్ ను ఆక్రమించి కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నేటి ఉదయం పాకిస్తాన్ సరిహద్దు దాటి భారత్ లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆర్ ఎస్ పురా సమీపంలోని సైనిక బంకర్ లోకి వెళ్లి కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు మృతి చెందినట్టు తెలిసింది. అంతకుముందు, పాకిస్తాన్ సైన్యం తేలికపాటి మోర్టార్లతో కాల్పులు జరిపిందని, భారత సైన్యం దాన్ని తిప్పికొట్టే హడావుడిలో ఉండగా ఉగ్రవాదులు చొరబడ్డారని ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News