: అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను... 1000 విమానాల నిలిపివేత
అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుపాను వణికిస్తోంది. వివిధ విమానాశ్రయాల్లో 1000కి పైగా విమానాలను నిలిపివేశారు. మరో 5 వేలకు పైగా విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూయార్క్ రహదార్లపై 4 అంగుళాల మేరకు మంచు పేరుకు పోవచ్చని భావిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అది 10 అంగుళాలకు చేరవచ్చని అధికారులు తెలిపారు. ఈ తుపాను సుమారు 2 కోట్ల మంది అమెరికన్లపై ప్రభావం చూపుతుందని, వీరంతా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని జాతీయ వాతావరణ సేవల కేంద్రం కోరింది.