: మెట్రో రైలు మార్గాల అలైన్ మెంట్ పై అఖిలపక్ష భేటీ
హైదరాబాద్ మెట్రో రైలు మార్గాల అలైన్ మెంట్ కు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమగ్ర చర్చకు అవకాశం కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నేటి శాసనసభ సమావేశాల్లో భాగంగా బీజేపీ లేవనెత్తిన చర్చకు సమాధానమిచ్చిన సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అఖిలపక్ష భేటీకి అవసరమైతే అధికారులను కూడా పిలిపిస్తామని ఆయన ప్రకటించారు. ప్రధానంగా జంటనగరాలకు చెందిన అందరు ఎమ్మెల్యేలు అఖిలపక్ష భేటీలో పాల్గొనేలా అవకాశం కల్పిస్తామని ఆయన ప్రకటించారు.