: గవర్నర్ వాహనంలో పొగలు... పోలీసుల అప్రమత్తతతో తప్పిన ముప్పు
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న కారులో పొగలు రావడంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. గురువారం పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి వెళ్లిన గవర్నర్ కుటుంబం తిరుమలకు బయలుదేరిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, కారు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెనువెంటనే కారును నిలిపివేసి, గవర్నర్ ను అందులో నుంచి దించేశారు. దీంతో, ముప్పు తప్పింది. వెంటనే మరో కారును సిద్ధం చేసి, ఆయనను అందులో తిరుమల పంపారు.