: భారత ఈవీఎంలతో ఆఫ్రికా ఎన్నికలు
తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నైజీరియా దేశం ఆఫ్రికా ఖండంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. అక్కడి ఎన్నికలకు కావాల్సిన ఈవీఎం యంత్రాలను భారత్ అందించడం విశేషం. ఈవీఎంలపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను విన్డోక్ హైకోర్టు కొట్టివేయడంతో ఆఫ్రికాలో మొట్టమొదటి ఈ-ఓటింగుకు మార్గం సుగమమైంది. నవంబర్ 28న దాదాపు 12 లక్షల మంది ఓటర్లు తమ దేశాధ్యక్షుడితోపాటు 96 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు.