: కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై దాడి


ఆమె సొంత మేనత్త. మేనత్త కూతురిని పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. గత కొంత కాలంగా అత్తను ఇదే విషయమై అడుగుతున్నాడు కూడా. అయితే, అందుకు ఆమె ససేమిరా అంది. కూతురికి వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. దీంతో, ఆగ్రహం పట్టలేకపోయిన మేనల్లుడు నేటి ఉదయం మేనత్త ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాలపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు రక్తపు మడుగులో కుప్పకూలగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News