: వివాహిత మహిళతో 'సంబంధం'... దళిత వ్యక్తిని ఉరి తీసిన గ్రామపెద్దలు!


వివాహిత మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడన్న కారణంగా ఓ దళిత వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని గ్రామ పంచాయతీ (పెద్దల కూటమి) ఉరివేసింది. బులంద్ షహర్ లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో సదరు వ్యక్తి మృత్యువాత పడగా, ఉరేసిన పంచాయతీ పెద్దలు తమకేమీ తెలియనట్లు కిమ్మనకుండా ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ ఘటనపై తమకేమీ ఫిర్యాదు రాలేదని చెప్పారు. బులంద్ షహర్ జిల్లాలోని నాగ్లా తోటా గ్రామంలో లాలా అనే దళితుడు, గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. సదరు మహిళకు వివాహం కాకముందు నుంచే వారిద్దరి మధ్య 'సంబంధం' ఉంది. అయితే పెళ్లైన తర్వాత కూడా సదరు మహిళ, లాలాను కలుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆర్నెల్ల క్రితం వారిద్దరూ డెహ్రాడూన్ కు పారిపోయారు. గ్రామానికి తిరిగి వచ్చిన లాలా, బుధవారం డెహ్రాడూన్ వెళ్తుండగా, సదరు మహిళ భర్త అడ్డగించాడు. అంతేగాక, గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అక్కడికి చేరిన గ్రామ పెద్దలు, గ్రామస్థుల కళ్లెదుటే లాలాను అక్కడి చెట్టుకు ఉరేశారు.

  • Loading...

More Telugu News