: గంటకు 590 కి.మీ వేగంతో వెళ్లే స్కూల్ బస్!


విమానాలకు వాడే జెట్ ఇంజిన్ తో తయారైన స్కూల్ బస్సులు వచ్చేస్తున్నాయి. అమెరికా ఇంజనీర్ పాల్ స్టెండర్ దీనిని తయారు చేశారు. గంటకు 590 కి.మీ వేగంతో దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ బస్సు అమెరికా అంతటా పర్యటిస్తూ, అందరినీ ఆకర్షిస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ తరహా బస్సులు వస్తే స్కూల్‌కు ఆలస్యమవడం ఉండదేమో! అయితే, ఈ బస్సు నడవాలంటే విమానాల రన్ వే వంటి విశాలమైన రోడ్లు ఉండాలి మరి!

  • Loading...

More Telugu News