: నిత్యానంద ముమ్మాటికీ పురుషుడే... సీఐడీ నివేదిక


సినీనటి రంజితతో రాసలీలలు సాగిస్తూ దొరికిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ముమ్మాటికీ పురుషుడేనని, ఆయన తన వయసుకు తగ్గట్టు శారీరక, మానసిక పరిపక్వత చెందారని రామనగర్ సెషన్స్ కోర్టుకు సీఐడీ తెలిపింది. నిత్యానంద పురుషత్వ పరీక్షల నివేదికను కోర్టుకు అందించింది. తాను ఆరేళ్ల బాలుడు వంటి వాడినని, అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. అయితే, పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘పురుషుడు’ అని నిర్ధారణ అయింది. అత్యాచార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 31 పేజీల నివేదికను కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్‌పీ లోకేష్ సెషన్స్ కోర్టుకు అందించారు.

  • Loading...

More Telugu News