: నేడు టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె...నిలిచిపోయిన షూటింగులు


వేతన సవరణను డిమాండ్ చేస్తూ తెలుగు చిత్రసీమ కార్మికులు నేడు నిరవధిక సమ్మెకు దిగారు. నేటి ఉదయం ప్రారంభమైన ఈ సమ్మెలో సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల్లో పనిచేస్తున్న 14 వేల మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నారు. అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో నేడు టాలీవుడ్ చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి' తరహా చిత్రాల షూటింగు పైనా ఈ సమ్మె ప్రభావం పడింది. వేతన సవరణకు సంబంధించి చిత్రరంగ ప్రముఖులలో పాటు చలనచిత్ర మండలి, నిర్మాతల మండలితో నాలుగు నెలలుగా కార్మికులు జరుపుతూ వస్తున్న చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో సమ్మెకు దిగక తప్పని పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఆయా విభాగాలకు చెందిన కార్మికులు తమ తమ కళా ప్రదర్శనలతో వినూత్న నిరసనలకు తెరలేపారు.

  • Loading...

More Telugu News