: ఏపీ బాటలో మాతో పాటు మరిన్ని కంపెనీలు: ఇసుజు ఉపాధ్యక్షుడు


ఏపీలో కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకు తమతో పాటు జపాన్ కు చెందిన ఇతర కంపెనీలు కూడా ఆసక్తిగా ఉన్నాయని ఇసుజు ఉపాధ్యక్షుడు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ ట్రక్కుల తయారీ యూనిట్లు భారత్ లో పది దాకా ఉన్నాయని ఆయన చెప్పారు. అయినా, భారత మార్కెట్ లో తమ కంపెనీ వాటా నామమాత్రమేనని ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్ లో యూనిట్లు ఉన్నా ఏపీలో మరో యూనిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. నిధులు, సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉన్నాయని, తమకు కావాల్సిందల్లా ప్రభుత్వ సంపూర్ణ సహకారం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News