: చంద్రబాబు పర్యటన ఫలితాలిచ్చేసింది!


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జపాన్ లో జరుపుతున్న పర్యటన ఇంకా ముగియనేలేదు, అప్పుడే ఫలితాలొచ్చేశాయి. నాలుగో రోజు పర్యటనలో భాగంగా జపాన్ లోని పలు నగరాల్లో పర్యటించిన చంద్రబాబు, ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన ఇసుజు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రతిపాదనలకు ముగ్ధులైన ఆ కంపెనీ ప్రతినిధులు, ఏపీలో పికప్ ట్రక్కుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక తన పర్యటనలో భాగంగా నేడు జపాన్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలతో చంద్రబాబు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇంకా రెండు రోజుల పర్యటన మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని కంపెనీలతో భేటీ కానున్న సీఎం, మరిన్ని ఒప్పందాలను సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

  • Loading...

More Telugu News