: భారత్ తో చర్చలకు మేం సిద్ధం...భారత్ కూడా చొరవ చూపాలి: పాక్
భారత్ తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో జరుగుతున్న సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ తో చర్చలకు భారత్ కూడా చొరవ చూపాలని అన్నారు. ప్రస్తుతానికి భారత్, పాక్ మధ్య చర్చలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. తటస్థ వేదికలపై చర్చలు జరిగే అవకాశం లేదని ఆయన పాక్ లో ఉండగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.