: ప్రభుత్వం నిర్వాకం వల్లే మందుల ధరలు ఇలా పెరిగిపోయాయి!: సీపీఎం
ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులు ఔషధాలు కొనుక్కోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఎం ఎంపీ పీ. రాజీవ్ విమర్శించారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, 108 రకాల ఔషధ ధరల నియంత్రణ నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో మందుల ధరలు అమాంతం పెరిగిపోయాయని అన్నారు. గతంలో సామాన్యులు క్యాన్సర్ కు వినియోగించే గిల్ వెక్ ధర 8,500 రూపాయలు ఉండగా, ఇప్పుడు లక్షా 8 వేల రూపాయలుగా ఉందని ఆయన తెలిపారు. టీబీ, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్, ఎయిడ్స్ రోగులు వినియోగించే మందుల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని నియంత్రణలోకి మందులను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.