: కుప్పకూలిన 80 కోట్ల ఖరీదు చేసే మానవరహిత విమానం


భారత వాయుసేనకు మరో దెబ్బ తగిలింది. ఈ ఏడాది కూలిన 5 విమానాల జాబితాలో మానవ రహిత విమానం కూడా చేరింది. భారత వాయుసేనకు చెందిన మానవరహిత విమానం (యుఏవీ) ఒకటి గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో కుప్పకూలింది. భుజ్ ప్రాంతంలో పర్యవేక్షణకు ఈ విమానాన్ని వినియోగిస్తున్నట్టు వైమానిక దళం పేర్కొంది. విమానం కూలడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, ఘటనపై విచారణ ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. విమానం కూలిన ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని వారు స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ మానవ రహిత విమానం ఖరీదు 80 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News