: ఎల్లుండి కచ్చితంగా సభలో వుండండి... కాంగ్రెస్ శాసనసభ్యులకు విప్ జారీ
కాంగ్రెస్ శాసనసభ్యులకు విప్ జారీ చేశారు. ఎల్లుండి శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో శాసనసభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలంటూ టీపీసీసీ విప్ జారీ చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ విప్ జారీ చేయడం విశేషం. విప్ లో కాంగ్రెస్ పార్టీకి చెయ్యిచ్చి, కారెక్కిన విఠల్ రెడ్డి, రెడ్యానాయక్, కనకయ్య, యాదయ్యలకు కూడా కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది.