: స్టార్ట్ అవ్వాలంటే బస్సుల్నే కాదు, విమానాన్నైనా తోయాల్సిందే!
స్టార్టింగ్ ప్రాబ్లం వున్నా బస్సుల్ని అప్పుడప్పుడు అందులోని ప్రయాణికులే తోస్తుండడం మనం చూస్తుంటాం. ఇప్పుడీ విమానం కూడా అదే బాపతు. అందుకే అందరూ కలసి ఓ పట్టు పట్టాల్సివచ్చింది. దక్షిణాసియా దేశమైన సైబీరియాలో విమానాన్ని ప్రయాణీకులు తోస్తే కానీ స్టార్ట్ కాలేదు. సైబీరియాలోని ఇగార్కా నుంచి క్రాస్ నోయార్క్ కు వెళ్తున్న విమానం మంచుతో గడ్డకట్టుకుపోయింది. దానిని లాగేందుకు ట్రక్కుల్ని వినియోగించాలనుకున్నారు. అవి కూడా గడ్డకట్టుకుపోయి స్టార్ట్ అయ్యేందుకు మోరాయించాయి. దీంతో ప్రయాణికుల్ని ఓ చేయి వేయమని సిబ్బంది అడిగారు. దీంతో ఇంటికెళ్లాలన్న కంగారులో వున్న 74 మంది ప్రయాణికులు తలో చేయి వేసి నెట్టారు. వారి శ్రమకు తోడు ఓ ట్రక్కు కూడా లాక్కెళ్లడంతో ఆ లోహవిహంగం స్టార్ట్ అయ్యింది. సైబీరియాలోని ఇగార్కా విమానాశ్రయం ఆర్కిటిక్ వలయానికి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడ నిరంతరం మంచు కురుస్తునే ఉంటుంది. దీంతో ఇక్కడ మైనస్ 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. దీంతో రన్ వే పై బిగుసుకుపోయిన విమానాన్ని బలంగా కాస్త దూరం నెట్టుకుంటూ వెళ్లారు. ఒకసారి గాలిలోకి ఎగిరాక విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ప్రయాణించిందని ఓ ప్రయాణికుడు చెబుతూ, తాను తీసిన వీడియోను యూట్యూబ్ లో పెట్టాడు.