: 'యస్'... నేను కాంగ్రెస్ లో చేరా!: ఖుష్బూ
సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. సోనియా గాంధీ సమక్షంలో తాను పార్టీలో చేరానని ఆమె తెలిపారు. తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆరునెలల తరువాత ఖుష్బూ పార్టీ మారడం విశేషం. గతంలో ఖుష్బూ బీజేపీలోకి వెళ్తారని తమిళనాట ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరడం విశేషమే. ఖుష్బూ చేరికతో తమిళనాట కాంగ్రెస్ కార్యకర్తలకు ఊపొస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.