: పుకార్లు ఖండిస్తూ నటుడు దిలీప్ కుమార్ ట్వీట్


బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ట్విట్టర్ లో ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్నేహితులు, అభిమానులు అందరికీ తెలిపారు. అంతేగాక, తన పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. "ఎంతోమంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. మీరు చూపుతున్న ప్రేమ, చేస్తున్న ప్రార్థనలు, అల్లా దీవెనలకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను" అని తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు 91 ఏళ్ల దిలీప్ పుల్ స్టాప్ పెట్టారు. కాగా, ఇదే విషయంపై సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నిన్న (మంగళవారం) ట్వీట్ చేశారు. "దిలీప్ కుమార్ గురించి ఆధారంలేని కొన్ని వదంతులు వచ్చాయి. కానీ, దిలీప్ జీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన భార్య సైరాజీ నాకు చెప్పారు" అని బిగ్ బీ పేర్కొన్నారు. ఇటీవలే సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహ రిసెప్షన్ కు దిలీప్ కుమార్ హాజరయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News