: తిరుచ్చిలో పందులవేట... మాఫియా బెదిరింపులు
తమిళనాడులోని తిరుచ్చి నగరంలో పందుల బెడద ఎక్కువైందట. దీంతో, నగరపాలక అధికారులు పందులను బంధించాలని నిర్ణయానికొచ్చారు. పందులను పట్టడంలో నిష్ణాతులతో కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఈ వేటకు శ్రీకారం చుట్టారు. అయితే, వారికి నగరంలో పందుల మాఫియా ఒకటుందని తెలియదు. తమ మానాన తాము పందులను పట్టుకుంటూ వెళ్లారు. అలా 83 పందులను పట్టుకున్న తర్వాత, బెదిరింపులు మొదలయ్యాయి. పందుల వేటను నిలిపివేయాలన్నదే ఆ బెదిరింపుల సారాంశం. ఖర్చు లేకుండా పందులు పెంచుతూ, వాటిపై భారీ లాభాలు ఆర్జించేందుకు అలవాటు పడిన పెంపకందార్లే ఈ బెదిరింపుల వెనుక ఉన్నట్టు కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. బాగా బలిసిన పంది ధర బహిరంగ మార్కెట్లో రూ.15 వేలు పలుకుతుండడమే మాఫియా ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.