: కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి చురక


హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై వివాదం రేపుతున్న కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారో ఓసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చేసినట్టు రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నేతలు డొమెస్టిక్ టెర్మినల్ కు మాత్రమే పేరు మార్చామన్న విషయం గుర్తించాలని చురక అంటించారు. బేగంపేట విమానాశ్రయంలో ఉన్న పేర్లను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బదలాయించిన కాంగ్రెస్ పార్టీ, ఎన్టీఆర్ పేరును మర్చిపోయిందని, కాంగ్రెస్ చేయని పనిని తాము పూర్తి చేశామని ఆమె స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమన్న విషయం కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News