: అవును... ఖుష్బూ కాంగ్రెస్ లో చేరుతున్నారు: ఇళంగోవన్
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై హస్తం నేతలు స్పందించారు. తమ పార్టీలో ఆమె సభ్యురాలు కాబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, "ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఖుష్బూ మా పార్టీలో చేరబోతున్నారు" అని పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.