: ఎల్ టీటీఈ అధినేత జయంతిని నిర్వహించిన వైగో
పలు వర్గాల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ, ఎండీఎంకే అధినేత వైగో, ఆయన వందలాది మద్దతుదారులు ఎల్ టీటీఈ అధినేత ప్రభాకరన్ 60వ జయంతిని ఎట్టకేలకు నిర్వహించారు. తమిళనాడు వర్గాల సమాచారం ప్రకారం, ఎండీఎంకే మద్దతుదారులు ముందు కేక్ కట్ చేశారు. పలు చోట్ల సభలు నిర్వహించి సామాన్య తమిళుల కోసం ప్రభాకరన్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు, సార్క్ సదస్సులో లంక అధ్యక్షుడు మహింద రాజపక్సను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించడాన్ని వైగో ఖండించినట్లు ఓ ప్రకటన విడుదలయింది. "సదస్సులో ప్రధానమంత్రి వైఖరికి నేను చాలా చింతిస్తున్నా. పలువురు తమిళులను చంపిన వ్యక్తితో అలా వ్యవహరించడం సరైంది కాదు. ఇందుకు నేను సిగ్గుపడుతున్నా, ఖండిస్తున్నా" అని వైగో అన్నారు.