: సరిత విషయమై క్రీడా శాఖ మంత్రిని కలిసిన సచిన్
ఆసియా క్రీడల్లో తనకు అన్యాయం జరిగిందని పతాకం నిరాకరించిన మహిళా బాక్సర్ సరితాదేవికి అందరూ అండగా నిలబడాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చాడు. పతకం తీసుకునేందుకు పోడియం ఎక్కకపోవడంతో సరితపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిషేధం వేటు వేసిన సంగతి తెలిసిందే. సరిత విషయమై సచిన్ నేడు కేంద్ర క్రీడల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ను కలిశారు. సరితపై నిషేధం నిర్ణయంపై ఆయనతో చర్చించారు. సచిన్ తో పాటు మేరీకోం, విజేందర్ సింగ్, ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామచంద్రన్, బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు జజోదియా, బాక్సింగ్ కోచ్ సంధు తదితరులు క్రీడల మంత్రిని కలిశారు.