: చిట్టీల పేరిట కోటి రూపాయల మేర టోకరా
చిట్టీల పేరిట ఓ జంట రూ.కోటికి టోపీ పెట్టింది. సికింద్రాబాద్ ఆల్వాల్ లోని సూర్యనగర్ లో ఓ జంట గత కొంత కాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అలా ఆ జంట చిట్టీల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసింది. అనంతరం ఉన్నపళంగా ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో, బాధితులు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.