: అబ్బే...భారత్, పాక్ మాట్లాడుకోలేదు!


సార్క్ సమావేశాల సందర్భంగా భారత్, పాక్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఓసారి పాక్ విదేశాంగ శాఖ సానుకూల ప్రకటన చేస్తే, మరోసారి భారత్ చర్చలపై సానుకూల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని శాంతి కాముకులు ఆశించారు. కానీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య ఎలాంటి భేటీకి అవకాశం లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. పాక్ తో చర్చలు జరగాలంటే ఆ దేశం విశ్వాసం కలిగించే చర్యలు చేపట్టాలని, భారత్ తో చర్చలు జరపాలా? లేక, జమ్మూ కాశ్మీర్ లోని అతివాదులతో చర్చలు జరపాలా? అనే స్వేచ్ఛ పాక్ కే ఉందని, వేర్పాటు వాదులతో చర్చలు జరిపేట్టయితే భారత్ తో చర్చలకు ఆస్కారం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, జమ్మూకాశ్మీర్ లోని వేర్పాటు వాదులతో చర్చించిన తరువాతే భారత్ తో చర్చిస్తామని పాక్ తెగేసి చెప్పింది. దక్షిణాసియా దేశాల్లో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం, విభేదాలు సరికాదని ప్రపంచ దేశాలు భారత్ పై నిత్యం ఒత్తిడి తెస్తుంటాయి.

  • Loading...

More Telugu News