: 'డీడీఎల్'పై యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రత్యేక ట్రైలర్
షారుక్ ఖాన్, కాజోల్ నటించిన 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రానికి సంబంధించి యశ్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్) తాజాగా ప్రత్యేక ట్రైలర్ ను విడుదల చేసింది. దానిని సంస్థ ట్విట్టర్ లో పోస్టు చేసింది. 1995లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ముంబయిలోని మరాఠా మందిర్ లో ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. డిసెంబర్ 12కు సినిమా వెయ్యి వారాలు పూర్తి చేసుకోనుంది. అందుకు గుర్తుగా వైఆర్ఎఫ్ సంస్థ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలతో ట్రైలర్ ను తీసుకొచ్చింది. మరోవైపు, ఈ సందర్భంగా యశ్ రాజ్ వారు ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. యూ ట్యూబ్ లో ఇప్పటికే ఈ వీడియోను 3 లక్షల 40వేలకు పైగా వీక్షించారు.