: అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకెళతాం: కిషన్ రెడ్డి


రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకెళతామని ఉద్ఘాటించారు. అంబేద్కర్ అందించిన గొప్పవరం రాజ్యాంగం అని కీర్తించారు. విద్రోహులు ఎన్ని యత్నాలు చేసినా, అవి విఫలమవుతున్నాయంటే అందుకు రాజ్యాంగం గొప్పదనమే కారణమని అన్నారు. రాజ్యాంగం బలంగా ఉండబట్టే దేశం ముందుకు వెళుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News