: సిగపట్లు, పిడిగుద్దులతో డ్వాక్రా మహిళల వీరంగం


ఖమ్మం మునిసిపల్ కమిషనర్ కార్యాలయం నేడు రణరంగాన్ని తలపించింది. దాదాపు 300 మంది డ్వాక్రా మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి, నిధులను మీరు కాజేశారంటే... మీరు కాజేశారని పరస్పరం ఆరోపించుకుంటూ దాడులకు పాల్పడ్డారు. జుట్లు పట్టుకుని, పిడిగుద్దులు కురిపించుకుంటూ వీరంగం సృష్టించారు. అసలు విషయం ఏమిటంటే... డ్వాక్రా సంఘాలకు చెందిన మొత్తం రూ.1.80 లక్షలను కొంతమంది స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో 80 వేలను తిరిగి కట్టేశారు. మరో లక్ష రూపాయల బకాయి ఇంకా అలాగే ఉంది. డబ్బులు పక్కదోవ పడుతున్నాయంటూ కొంతమంది కలిసి ఓ గ్రూపు నాయకురాలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. దాంతో 28 డ్వాక్రా సంఘాలకు చెందిన దాదాపు 300 మంది మహిళలు ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇందులో ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు డ్వాక్రా మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News