: రాజ్ నాథ్ హెలికాప్టర్ దారితప్పింది!


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పిందట. మఝగావ్ లో ల్యాండవ్వాల్సి ఉండగా, బడా జమ్దా ప్రాంతంలో దిగింది. సగం దూరం ప్రయాణించిన తర్వాత తాము వేరే రూట్లో ప్రయాణం చేస్తున్న సంగతిని పైలెట్ గుర్తించాడు. అప్పటికే చాలా దూరం వచ్చేశారట. కాగా, చైబాసా ప్రాంతంలోని బడా జమ్దా ఎంతో సమస్యాత్మక ప్రాంతం కావడంతో రాజ్ నాథ్ భద్రతపై ఆందోళన నెలకొంది. కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత ప్రముఖ వ్యక్తి రాజ్ నాథ్ కావడంతో అధికార గణానికి చెమటలు పట్టాయట. ప్రస్తుతం పైలెట్ ఎలా దారితప్పాడన్న విషయమై విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News