: నెల్లూరులో నకిలీ బాబా అరెస్ట్
యువతులను మోసగించి పూజల పేరిట వారి నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న నకిలీ బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నెల్లూరు ఆదిత్యనగర్ లోని ఓ ఇంట్లో ఈ బాబా యువతితో నగ్నంగా పూజలు చేయిస్తూ, ఆ దృశ్యాలను వీడియో తీస్తూ పోలీసులకు దొరికిపోయాడు. గతంలో కూడా ఈ నకిలీ బాబా పలుమార్లు యువతుల దృశ్యాలను చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు. చిత్రీకరించిన వీడియో దృశ్యాలను చూపి, యువతులను బ్లాక్ మెయిల్ చేస్తూ, వారినుంచి డబ్బు వసూలు చేస్తుండేవాడు. బాబా లీలలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.