: ఈ సాయంత్రం సోనియాను కలవనున్న ఖుష్బూ... కాంగ్రెస్ లో చేరే అవకాశం!


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈ సాయంత్రం అందాల నటి ఖుష్బూ కలవనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్ మెంట్ పొందారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో, సాయంత్రం ఐదు గంటలకు సోనియాతో సమావేశమవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే అధికారికంగా ఖుష్బూ కాంగ్రెస్ లో చేరవచ్చని అంటున్నారు. దీనిపై ఆమెనే అడగ్గా, "ఏదైనా విషయం ఉంటే నేనే మీకు చెబుతాను" అంటూ ముక్తాయించారు.

  • Loading...

More Telugu News