: కన్న కూతురితో కామదాహం తీర్చుకున్న ఎయిడ్స్ రోగి


సభ్య సమాజం తలదించుకునే రీతిలో కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. పైగా అతనికి ఎయిడ్స్ వ్యాధి కూడా ఉందట. గుండెల్ని పిండేసే ఈ ఉదంతం సూరత్ లోని సచిన్ పారిశ్రామికవాడలో జరగ్గా, బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఇనస్పెక్టర్ పి.బి. సాప్రా కథనం ప్రకారం... 42 ఏళ్ల హెచ్.ఐ.వి పాజిటివ్ వ్యక్తి ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఉండటంతో ఇప్పటివరకూ ఆ బాలిక తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. చివరికి తన తల్లితో కలసి ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్ కు వచ్చింది. తనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నపుడు తొలిసారి అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News