: లక్షా 90 వేల ఎకరాలు కబ్జారాయుళ్ల చేతుల్లో ఉన్నాయి: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా లక్షా 90 వేల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జారాయుళ్ల చేతిలో చిక్కుకుని ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో అసైన్డ్ భూముల ఆక్రమణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పది జిల్లాల్లో అసైన్డ్ భూముల కబ్జాపై సభాసంఘం వేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. పొన్నాల కబ్జా చేశారని చెబుతున్న 8 ఎకరాల అసైన్డ్ భూమిని రద్దు చేయాలని గత ప్రభుత్వమే ఆదేశాలిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు, పొన్నాల భూకబ్జాకు పాల్పడ్డారంటూ టీఆర్ఎస్ ఆరోపించడంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు పార్టీల పరస్పర నినాదాలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News