: జీకే వాసన్ కొత్త పార్టీకి జెండా సిద్ధం
కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ తన పార్టీ జెండాను సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు పార్టీ అనుచరులకు దాన్ని చూపించారట. నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన ఈ జెండా జాతీయ పతాకాన్ని పోలి ఉందని, దానిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె.కామరాజ్, దివంగత జీకే మూపనార్ (కాంగ్రెస్ నేత) ల ఫోటోలు ఉన్నాయట. మరికొన్ని రోజుల్లోనే వాసన్ తన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.