: సానియాపై ఐరాస ప్రశంసల జల్లు


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితురాలైన సంగతి తెలిసిందే. ఆమె నియామకంపై ఐరాస మహిళా విభాగం స్పందించింది. సానియాపై ప్రశంసల జల్లు కురిపించింది. సానియా ఒక్క భారత అమ్మాయిలకే కాకుండా, ప్రపంచంలోని బాలికలందరికీ కూడా ఆదర్శప్రాయురాలని పేర్కొంది. ఐరాస అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఐరాస మహిళా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ లక్ష్మీ పురి మాట్లాడుతూ, సానియా వంటి డైనమిక్ మహిళ తమ దక్షిణాసియా గుడ్ విల్ అంబాసడర్ గా వ్యవహరించడాన్ని గౌరవంగానూ, సంతోషకరంగానూ భావిస్తున్నామని తెలిపారు. "సానియా ఓ యూత్ ఐకాన్. అంతేగాదు, క్రీడారంగానికి దీపస్తంభం వంటిది. మహిళల సమస్యలపై ఆమె ఎన్నోసార్లు ఎలుగెత్తింది" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News