: ఒక్క బ్రేక్ ఫాస్ట్ బార్ తో 700 క్యాలరీల శక్తి: వ్యోమగాముల కోసం నాసా నూతన సృష్టి


అంతరిక్షంలో నెలల తరబడి పరిశోధనల్లో మునిగితేలే ఆస్ట్రోనాట్ లకు ఉపయోగపడేలా కొత్తతరం బ్రేక్ ఫాస్ట్ బార్ లను తయారు చేసే పనిలో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం 'నాసా' నిమగ్నమైంది. ఒక్క బార్ తింటే 700 నుంచి 800 క్యాలరీల శక్తి వస్తుందని డిస్కవరీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సాధారణంగా స్పేస్ స్టేషన్ లో ఉండే వ్యోమగాములకు రోజుకు 3 వేల క్యాలరీల శక్తి అవసరం. భూమికి దాదాపు 260 మైళ్ళపైన ఉండే కక్ష్యలోని స్పేస్ స్టేషన్ ఆస్ట్రోనాట్ లకు కావాల్సిన గుడ్లు, బ్రెడ్ లు, డ్రింక్స్ తదితరాలను కార్గో షిప్ లు చేరవేస్తుంటాయి. వీటి నిర్వహణ భారం అవుతున్న నేపథ్యంలో, నాసా బ్రేక్ ఫాస్ట్ బార్ ల తయారీకి సంకల్పించింది. ఇందులో నాసా శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, ఒక్క అల్పాహార గుళికతో 6 ఫుడ్ పాకెట్ల మేర బరువును తగ్గించవచ్చు.

  • Loading...

More Telugu News