: టెర్మినల్ కు గతంలో ఉన్న పేరునే పునురుద్ధరించాం: అశోక్ గజపతిరాజు
శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ కు గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజ్యసభలో వెల్లడించారు. అయితే, విమానాశ్రయానికి రాజీవ్ పేరు అలానే ఉందని తెలిపారు. ఇందులో తామెలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని సభలో వివరించారు. మరోవైపు, శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. దానికి సంబంధించి పౌర విమానయాన శాఖ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.